Advertisementt

అందరూ మెరిసిపోతే.. పవన్ మాత్రం..!!

Sat 13th Jul 2024 07:52 PM
pawan kalyan  అందరూ మెరిసిపోతే.. పవన్ మాత్రం..!!
Pawan Kalyan Arrives In Mumbai అందరూ మెరిసిపోతే.. పవన్ మాత్రం..!!
Advertisement
Ads by CJ

శుక్రవారం రాత్రి ముంబై మొత్తం మెరిసిపోయింది. ప్రపంచంలోనే అందరూ గొప్పగా చెప్పుకునేలా జరిగిన అపరకుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి దేశం నలుమూల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కోలీవుడ్ ఇలా చిత్ర పరిశ్రమలకు చెందినవారు మాత్రమే కాదు..  

క్రికెటర్స్, రాజకీయ నాయకులు అందరూ కళ్ళు జిగేల్ మనిపించే దుస్తుల్లో మెరుపులు మెరిపించారు. ముంబై మొత్తం సెలబ్రిటీస్ తో నిండిపోయింది. సౌత్ నుంచి రామ్ చరణ్, మహేష్, వెంకటేష్, రజినీకాంత్, సూర్య, యష్ ఇలా కొంతమంది స్టార్స్ తమ తమ భార్యలతో సహా అనంత్ వెడ్డింగ్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు. అందరూ కాస్ట్లీ డిజైనర్లు అవుట్ ఫిట్స్ లో మెరిశారు. 

పెళ్ళికి హాజరవ్వకపోయినా అనంత్ అంబానీ-రాధికల Shubh Aashirwad కి పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్ గా వెళ్లారు. ఆయన వారాహి అమ్మవారి మాలలో ఉన్నారు. ఆ దుస్తులతోనే పవన్ కళ్యాణ్ అనంత్ అంబానీ శుభ్ ఆశీర్వాద లో పాల్గొంటున్నారు. ఇదే వేడుకలో ఆంద్ర సీఎం చంద్రబాబు, వెంకటేష్ లాంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. పవన్ ముంబై కి చేరుకున్న ఎయిర్ పోర్ట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

Pawan Kalyan Arrives In Mumbai :

Pawan Kalyan Arrives In Mumbai To Attend Anant-Radhika Shubh Aashirwad Ceremony

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ