Advertisementt

గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న సినిమా

Sat 13th Jul 2024 07:21 PM
bharateeyudu 2  గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న సినిమా
A film that has worried the fans of star heroes గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న సినిమా
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్స్ గా మారిన ఎన్టీఆర్- రామ్ చరణ్ లు ఆ చిత్రం తర్వాత అదే రేంజ్ చిత్రాలను ఎంచుకున్నారు. ఎన్టీఆర్ కొరటాలతో దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తుండగా..రామ్ చరణ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. గ్లోబల్ స్టార్స్ గా విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోలిద్దరూ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

అయితే ఒకరకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా ఇప్పుడు ఒకే సినిమా వలన ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. అది కూడా ఒకే ఒక్క సినిమా. అది ఇండియన్ 2. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రం చూసాక ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులిద్దరూ ఢీలా పడిపోయారు. 

ఇండియన్ 2 పై వస్తున్న విమర్శలతో శంకర్ గేమ్ చెంజర్ చిత్రాన్ని ఏం చేస్తారో అని మెగా ఫ్యాన్స్, అదే భారతీయుడు 2 కి సంగీతమందించిన అనిరుద్ రవిచంద్ర అడుగడుగునా నిరాశ పరిచాడు. అదే అనిరుద్ దేవర కి మ్యూజిక్ ఇస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది. అనిరుద్ దేవర ని ఏ తీరానికి చేరుస్తాడో అంటూ కలవరపడుతున్నారు. 

అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఇద్దరూ ఒకే ఒక్క సినిమా వలన కంటి మీదకి కునుకు రాకుండా కలవరపడుతున్నారు. 

A film that has worried the fans of star heroes:

NTR-Charan fans are sleep deprived with Bharateeyudu 2

Tags:   BHARATEEYUDU 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ