గత రాత్రి నుంచి సోషల్ మీడియా మొత్తం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు రంగురంగుల ట్రెడీషనల్ అవుట్ ఫిట్స్ తో మెరుపులు మెరిపిస్తున్నారు. ముంబై వేదికగా జరిగిన వరల్డ్ రిచ్చెస్ట్ అంబానీ వెడ్డింగ్ లో నార్త్ గర్ల్స్ నుంచి క్రికెటర్స్ భార్యలు, సౌత్ హీరోల భార్యలు అంతా అద్భుతమైన డిజైనర్ వేర్స్ లో సోషల్ మీడియాని కబ్జా చేసారు.
వారు పెళ్ళికి హాజరయ్యే ముందే ఫోటో షూట్స్ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. అందులో రాశి ఖన్నా ఒకరు. రాశి ఖన్నా అదిరిపోయే డిజైనర్ లెహంగాలో ఆకర్షణగా కనిపించే ఫోటో షూట్స్ తో సూపర్బ్ అనిపించింది.
కొన్నాళ్లుగా గ్లామర్ కి కొత్తర్ధం చెబుతున్న రాశి ఖన్నా క్రీమ్ కలర్ లెహంగాలో బ్యూటిఫుల్ లుక్స్ తో అదరహో అనిపించింది. అందాలు ఆరబోస్తూనే సాంప్రదాయ దుస్తుల్లో రాశి ఖన్నా లేటెస్ట్ లుక్ అందరిని కట్టిపడేసింది.