Advertisementt

మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ స్టార్ట్

Sat 13th Jul 2024 01:31 PM
mega fans  మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ స్టార్ట్
Tension started for mega fans మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ స్టార్ట్
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం మినీ యుద్ధం చేసిన మెగా ఫ్యాన్స్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ అవుట్ పుట్ పై ఆందోళన మొదలైంది వాళ్ళకి. రెండు సినిమాలని ఒకేసారి తెరకెక్కించిన శంకర్ పై నిన్నటివరకు నమ్మకం ఉంది. కానీ ఈరోజు మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేసిన విషయం ఏమిటంటే ఇండియన్ 2 రిజల్ట్.

నిన్న శుక్రవారం ఏంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాదు క్రిటిక్స్ నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ రావడమే కాదు.. శంకర్ మేకింగ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆడియన్స్ ని చూసి మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ మొదలయ్యింది. శంకర్ గేమ్ చేంజర్ ని ఏం చేస్తారో అని వారికి బెంగ.

ఇండియన్2 కి వచ్చిన టాక్ గేమ్ చెంజర్ పై ఎఫెక్ట్ పడుతుంది అని ముందు నుంచి ఆందోళనగానే ఉన్నారు. సినిమా హిట్ అయితే గేమ్ చెంజర్ మార్కెట్ పరుగులు పెడుతుంది, అదే తేడా కొడితే గేమ్ చెంజర్ పై ఆ ఎఫెక్ట్ పడుద్ది అని వారు ముందునుంచి అనుకున్నట్టుగానే భారతీయుడు 2 కి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ సంగతి ఏమిటో అని దిగాలు పడిపోతున్నారు. మరి శంకర్ దర్శకత్వంలో కథ లేకుండానే భారతీయుడు 2 ని తెరకెక్కించి ప్రేక్షకులను మోసం చేసారు. భారీతనం కొట్టొచ్చినా టెక్నీకల్ గా సినిమా వర్కౌట్ అవ్వలేదు. రేపు గేమ్ చేంజర్ ని ఏం చేస్తాడో ఈ శంకర్ గారు అని మెగా అభిమానులకి ఇప్పటి నుంచే టెన్షన్ మొదలయ్యింది. 

Tension started for mega fans:

Shankar disappointed Mega Fans

Tags:   MEGA FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ