Advertisementt

సూపర్ స్టార్ లుక్ పై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

Sat 13th Jul 2024 11:43 AM
mahesh  సూపర్ స్టార్ లుక్ పై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ
Mahesh fans are happy with Mahesh look సూపర్ స్టార్ లుక్ పై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా సూపర్ స్టార్ మహేష్ తన లుక్ కనిపించకుండా క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తూ కనిపిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో అలాగే వెకేషన్ ఫొటోస్ లో ఎక్కడ చూసినా మహేష్ అలానే కనిపించారు తప్ప తన లుక్ చూపించలేదు. రాజమౌళి చిత్రం కోసమే మహేష్ మేకోవర్ అవుతున్నారని అందరికి  తెలుసు. కానీ మహేష్ మాత్రం ఆ విషయం లో కాస్త సీక్రెట్ గానే కనిపిస్తున్నారు. 

తాజాగా మహేష్ లుక్ ఫుల్ గా రివీల్ అయ్యింది. అది కూడా ముంబైలో. నిన్న రాత్రి జరిగిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వెడ్డింగ్ లో మహేష్ తన వైఫ్ నమ్రత, కుమార్తె సితారతో కలిసి హాజరయ్యారు. అక్కడ బ్లాక్ డ్రెస్ లో మహేష్ లుక్ పూర్తిగా రివీలయ్యింది. చాలా స్టయిల్ గా లాంగ్ హెయిర్ తో పెంచిన గడ్డంతో మహేష్ కొత్తగా కనిపించారు. 

ఇప్పటివరకు మహేష్ ఇలాంటి లుక్ ట్రై చెయ్యలేదు. ఇదే లుక్ తో మహేష్ రాజమౌళి సినిమాలో కనిపిస్తారని సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ లు చూసి మహేష్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే రాజమౌళి మహేష్ పై విదేశాల్లో లుక్ టెస్ట్ చేసేసారని ప్రస్తుతం ఆయన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారని తెలుస్తుంది. 

ఆగష్టు 9 మహేష్ బర్త్ డే కల్లా రాజమౌళి-మహేష్ కాంబో చిత్రం పై పూర్తి క్లారిటీ వస్తుంది అని.. రాజమౌళి కాన్సెప్ట్ వీడియో ని రెడీ చేసే పనిలో బిజీగా వున్నారని సమాచారం. 

Mahesh fans are happy with Mahesh look:

Mahesh fans are happy with Mahesh new look

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ