ముంబైలో మరికొద్ది గంటల్లో జరగబోయే రిచ్చెస్ట్ వెడ్డింగ్ అనంత్ అంబాని పెళ్లి లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆనందంతో డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ముంబైలో గత కొద్దిరోజులుగా అంగరంగ వైభవం అనేకంటే ఎన్నో ఏళ్ళు ఈ పెళ్లి గురించి చెప్పుకునేలా ముఖేష్-నీత అంబానీలు తమ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చేస్తున్నారు.
ఈవేడుకకి గత మూడు రోజులుగా సీతాకోక చిలుకల్లా ముస్తాబై బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరవుతుంటే పెళ్లి వేడుకకి మాత్రం సౌత్ నుంచి సూపర్ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్-ఉపాసన తమ కుమార్తె తో సహా హాజరవగా.. మహేష్ కూడా భార్య నమ్రత, కుమర్తె సితార తో కలిసి ఈ పెళ్లి కోసం ముంబై వెళ్లారు. ఇక కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన భార్య లత, కూతురు, అల్లుడు హాజరయ్యారు.
అనంత్ అంబానీ పెళ్లి కొడుకు గెటప్ లో నడుస్తూ ఉండగా.. సూపర్ స్టార్ పంచె కట్టులో డాన్స్ చేస్తూ ఉండగా.. పక్కనే అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్ కూడా ఉత్సాహంగా స్టెప్స్ వేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అనంత్ అంబానీ పెళ్ళిలో సూపర్ స్టార్ డాన్స్ అంటూ అప్పుడే నెటిజెన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.