టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కట్టి గెలుస్తారో లేదో అనే ఊహని బద్దలు చేస్తూ 2024 ఎన్నికల రిజల్ట్ వచ్చింది. కూటమి 161 స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగరేసింది. వైసీపీ కేవలం 11 మంది ఎమ్యెల్యే సీట్లతో సరిపెట్టుకుంది. వై నాట్ 175 అంటూ జగన్ నమ్మకాన్ని ఏపీ ప్రజలు 11 కి సరిపెట్టేసారు. దానిలో వైసీపీ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాడాల్సిన పరిస్థితి.
అటు చూస్తే వైసీపీ నేతలు జగన్ పై విరుచుకుపడుతున్నారు. జగన్ వలనే వైసీపీ ఓడిపోయింది అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటుంటే మరికొంతమంది నేతలు టీడీపీ వైపు, జనసేన వైపు చూస్తున్నారు. ఎలాగైనా టీడీపీ పార్టీలో చేరి ఆస్తులని కాపాడుకుని, కేసుల పాలవకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు.
ఇక వైసీపీ లో గెలిచిన 11 మంది ఎమ్యెల్యేల్లో కొంతమంది ఇప్పడు టీడీపీ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారనే న్యూస్ జగన్ శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఎమ్యెల్యేలు మాత్రమే కాదు వైసీపీ ఎమ్యెల్సీ లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారనే వార్త జగన్ లో ఆందోళన కలిగిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది.. మరి తన పార్టీ నుంచి జారిపోతున్న ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలను జగన్ ఆపడానికి ట్రై చేస్తారో.. లేదంటే వెళ్లే వాళ్లని ఆపడం ఎందుకు అనుకుంటారో చూడాలి.