Advertisement

భారతీయుడు 2 పై విమర్శల దాడి !

Fri 12th Jul 2024 04:28 PM
bharatiyadu 2  భారతీయుడు 2 పై విమర్శల దాడి !
Criticism attacks Bharatiyadu 2 భారతీయుడు 2 పై విమర్శల దాడి !
Advertisement

భారతీయుడు 2 సినిమాని వీక్షించిన ఓ తెలుగు సినీ ప్రేక్షకుడు తన సోషల్ మీడియా లో ఇలా స్పదించాడు. 

భారతీయుడు సినిమా గొప్పతనం ఏంటి?

28ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో జనాలకు నచ్చిన అంశాలేంటి?

ఎందుకు ఆ సినిమా అంతటి విజయాన్ని సాధించింది?

ఈ విషయాలు అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి దర్శకుడు శంకర్..

మరి ఆ సినిమా సీక్వెల్ అనుకున్నప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన బాధ్యత శంకర్ కి ఉండాలికదా..!?

భారతీయుడు అంటే.. తప్పుచేసిన వాళ్ళను మర్మకళతో శిక్షించే పెద్దాయన మాత్రమే కాదు..

తెల్లదొరల గుండెల్లో గుర్రాలు పరిగెత్తించిన అపర సుభాష్ చంద్రబోస్.. 

బ్రిటిష్ కార్యాలయాలపై త్రివర్ణ పాతాకాలను ఎగరేసిన స్వాతంత్ర్య సమరయోధుడు..

తమ వస్తువుల్ని బహిష్కరించారన్న అక్కసుతో.. భారత స్త్రీలను వివస్త్రలుగా చేసి, వారి ఆత్మహత్యలకు కారకులైన బ్రిటిష్ సైన్యాన్ని కత్తి కొక కండగా నరికిన అభినవ ఛత్రపతి..

స్వచ్ఛమైన మనసుతో స్వేచ్చా వాయువులను పీల్చుకొంటూ.. కుటుంబంలోనే దేశాన్ని చూసుకుంటూ బతికిన దేశభక్తుడు..

తాళి కట్టిన ఇల్లాలిని ప్రాణసమానంగా ప్రేమించిన గొప్ప భర్త..

లంచగొండి తనానికి బలైపోయిన కూతుర్ని చూసుకొని గుండె పగిలేలా రోదించిన కన్నతండ్రి..

అవినీతి కలుపుని పీకవతలపారేసి, దేశాన్ని సస్యశ్యామలం చేయడానికి నడుంకట్టిన రైతు..

దేశద్రోహం చేసినవాడు ఎవడైనా.. ఎంతటివాడైనా.. చివరకు కన్నబిడ్డయినా ఒకే శిక్ష.. మరణం..

ఏ చేతులతో అయితే ఎత్తుకొని పెంచాడో.. అదే చేతులతో కన్న కొడుకుని.. గుండెల్లో పొడిచి పొడిచి చంపిన సేనాపతి, ఆ క్షణాన అనుభవించిన గుండెకోత ఇప్పుడు గుర్తొచ్చినా మానసంతా బరువెక్కుతుంది..

మరి శంకర్ ఈ విషయాలు ఎలా మర్చిపోయాడు..?

నటులు.. సాంకేతిక నిపుణులు.. వీరి ప్రతిభను బయటకు తెచ్చేది కథలోని ఉద్వేగాలేకదా..!?

కమల్ నటవిశ్వరూపం చూపించారన్నా.. 

రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారన్నా.. శంకర్ జనరంజకంగా తీశారన్నా.. 

కారణం కథలోని ఉద్వేగాలే..

భారతీయుడు ఉద్వేగాల పాలపుంత.. మరి భారతీయుడు 2 ?????

ఏమీ లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు?

జనాలు ఎందుకు చూస్తారు?

ఏదేమైనా నేటి తరం ముందు భారతీయుడి పరువును నిలువునా తీశారు శంకర్.. 🙏🏼

ఏదో నాలుగు అవినీతి సీన్స్ చూపించి.. 

సోషల్ మీడియాతో సేనాపతి(భారతీయుడు)ని పిలిపించి.. 

ఆయనతో ఓ నలుగుర్ని చంపించి.. 

మర్మకళ అంటూ విచిత్ర విన్యాసాలతో జనాన్ని హింసించి.. 

ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు..

ఆయన తీసిన సినిమా గొప్పతనం ఆయనకే తెలియకపోతే ఎలా?

దీనికి తోడు మళ్ళీ పార్ట్ 3 అంట.. 🤕

సేనాపతి గారూ.. క్షమించండి 🙏🏼🙏🏼🙏🏼 అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Criticism attacks Bharatiyadu 2:

Bharatiyadu 2 social media talk

Tags:   BHARATIYADU 2
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement