నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రెడీ అయ్యాడనే సంకేతాలు సోషల్ మీడియా ద్వారా అందుతూనే ఉన్నాయి. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ అతను హీరో అవ్వడానికి రెడీ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి. అలా మోక్షజ్ఞ లుక్ బయటకి రాగానే.. అతని ఎంట్రీ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడం మాత్రమే కాదు.. మోక్షజ్ఞను విల్వర్ స్క్రీన్ కి పరిచయం చెయ్యబోయే దర్శకుడిపైనే అందరి కళ్ళు ఉన్నాయి.
నిన్నమొన్నటివరకు క్రిష్, పూరి జగన్నాధ్, బోయపాటి పేర్లు మోక్షజ్ఞ ని తెర కి పరిచయం చేసే దర్శకుల లిస్ట్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆల్మోస్ట్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ చెయ్యబోయే దర్శకుడు అని.. ఈ చిత్రాన్ని నిర్మించే వారి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మోక్షజ్ఞ ని ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ అవడం లేదు. అది బాలయ్య చిన్న కుమార్తె, మోక్షజ్ఞ చిన్నక్క తేజస్వి నిర్మాతగా నందమూరి వారసుడు తెరంగేట్రం మూవీ మొదలు కాబోతుంది అనే న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజస్విని నిర్మాతగా.. మోక్షజ్ఞ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.