గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడిపోతున్నారు. ఇప్పటివరకు దేవర సాంగ్స్ పై గట్టి నమ్మకంతో ఉన్న వారు ఇప్పుడు ఆందోళన పడడం కేవలం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ వలనే. విక్రమ్, జైలర్ వంటి సినిమాలతో BGM కి ప్రాణం పోసిన అనిరుద్ ని కొరటాల పట్టుబట్టి దేవర కి మ్యూజిక్ డైరెక్టర్ గా తెచ్చుకోగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. అప్పుడే దేవర మ్యూజికల్ హిట్ అని ఫిక్స్ అయ్యారు.
కానీ ఇప్పుడు అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడిపోతున్నారు. కారణం అనిరుద్ రవిచంద్రన్ భారతీయుడు 2కి ఇచ్చిన మ్యూజిక్ పై, BGM పై వస్తున్న ఫీడ్ బ్యాక్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. భారతీయుడు 2 మైనస్ పాయింట్ లో మ్యూజిక్ పరంగా, నేపధ్యం సంగీతం పరంగా చాలా వీక్ అనే మాట అందరి నోటా వినిపిస్తుంది.
పాటలు చాలా గ్రాండ్ గా ఉన్నప్పటికీ.. మ్యూజిక్ నిరాశ పరచడమే కాదు.. BGM మరింత నీరసం తెప్పించింది అంటూ మాట్లాడుతున్నారు. అనిరుధ్ పూర్తిగా నిరాశపరిచిన చిత్రాల్లో ఇండియన్-2 ముందు వరుసలో ఉంటుంది అనే మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనలోకి నెట్టేసింది. దేవర పై గంపెడు ఆశలతో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అనిరుద్ తన మ్యూజిక్ తో ఏం చేస్తాడో అని వాళ్ళకి భయం పట్టుకుంది.
మరి ఇప్పుడు దేవర మ్యూజిక్ ఆల్బమ్ విషయంలో ఎన్టీఆర్ ఆందోళన తొలగాలంటే మాంచి ఊపున్న మాస్ బీట్ ని దేవర ప్రమోషనల్ సాంగ్ గా వదిలితేనే కానీ.. లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా విడుదల వరకు ఈ టెన్షన్ తప్పేలా లేదు.