దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు పాటకి ఏకంగా ఆస్కార్ అవార్డు నే సొంతం చేసుకుంది. హాలీవుడ్ ప్రముఖుల సైతం ఆర్.ఆర్.ఆర్ ని పొగిడేశారు. ఇపుడు ఈ చిత్రం సౌత్ ఫిల్మ్‌ఫేర్ లోను పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి హావా చూపించింది.
సౌత్ లోనే అత్యంత పాపులర్ అవార్డ్స్ అయిన ఫిల్మ్‌ఫేర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సౌత్ యాక్టర్స్, సాంకేతికత నిపుణులను గుర్తించి అవార్డులను ప్రధానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వివిధ కేటగిరిల్లో ఆర్.ఆర్.ఆర్ పలు అవార్డులను సొంతం చేసుకుంది. 2023 ఏడాదిలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కొన్ని కారణాల వలన నిర్వహించకపోవడంతో ఇప్పుడు ఈ ఏడాది ఈ అవార్డులను ప్రకటించారు.
2023 సంవత్సరానికి గాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలను సంబంధించిన సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించారు. అందులో తెలుగులో ఆర్.ఆర్.ఆర్ చిత్రం 8 అవార్డులతో సత్తా చాటింది. అలానే సీతారామం చిత్రం 5 అవార్డులు, విరాట పర్వం 2 అవార్డులు సొంతం చేసుకున్నాయి.
ఉత్తమ చిత్రం - RRR
ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (RRR)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం బెస్ట్ యాక్టర్ (మేల్)
బెస్ట్ యాక్టర్: జూనియర్ ఎన్టీఆర్ & రామ్ చరణ్ (RRR )
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)
బెస్ట్ యాక్టర్ (ఫీమేల్) - మృణాల్ ఠాకూర్ (సీతారామం)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) - సాయి పల్లవి (విరాట పర్వం)
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాట పర్వం)
బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ - ఎం.ఎం. కీరవాణి (RRR)
బెస్ట్ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కానున్న కళ్యాణం- సీతారామం)
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్) - కాల భైరవ (కొమరం భీముడో - RRR)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమా - సీతారామం)
బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు-RRR)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (RRR)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - సెంథిల్ (RRR) & రవి వర్మన్ (పొన్నియన్ సెల్వన్)