భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా లైకా ప్రొడక్షన్ వారు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జులై 12 ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెలరోజులుగా ఇండియన్ 2 టీమ్ ఈ చిత్రానికి చేస్తున్న ప్రమోషన్స్, గతంలో వచ్చిన భారతీయుడు సినిమా భారీ హిట్ అవడం, ఇండియన్ 2 ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి.
మరి నేడు విడుదలైన ఇండియన్ 2 చిత్రం ఓవర్సీస్ షోస్ ఇప్పటికే కంప్లీట్ అవడంతో అక్కడి ఆడియన్స్ ఇండియన్ 2 చిత్రం పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా X వేదికగా పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది సినిమా సూపర్ అంటే మరికొంతమంది యావరేజ్ అంటున్నారు. ఇంకొంతమంది అందులో భారితనం తప్ప ఇంకేం లేదని తేల్చేస్తున్నారు.. ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్ లోకి వెళితే..
ఈ చిత్రంలో శంకర్ మార్క్ భారీతనం మాత్రం పుష్కలంగా ఉంది, సాంగ్స్ అయితే గ్రాండ్ విజువల్స్ తో అదరగొట్టాయి. సేనాపతిగా కమల్ హాసన్-సిద్ధార్థ్ కాంబోలో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా ఆకట్టుకోగా.. సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలిచాయని, అలాగే క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు.
ఇక మైనస్ లలోకి వెళితే ఫస్టాఫ్ మొత్తం పేలవంగా ఏ మాత్రం ఆకట్టుకోదు, అంతేకాదు భారతీయుడు 2కి బిగ్ మైనస్ అనిరుద్ BGM, పాటల విషయం పక్కన పెడితే అసలు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా మైనస్ అంటున్నారు. ఇక కమల్ పై ప్రోస్తటిక్ మేకప్ చాలా ఆర్టిఫీషియల్ గా ఉండగా.. కొన్ని సీన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా గ్రాఫిక్స్ అన్నట్టుగా తెలిసిపోతున్నాయని ఆడియన్స్ చెబుతున్నారు.
మరి ఫస్ట్ హాఫ్ తేలిపోగా.. సెకండ్ హాఫ్ బెటర్ అంటూ ఇండియన్ 2 పై ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.