ఎన్నికల ముందు వైసీపీ నేతలు టీడీపీ లో చేరినా చంద్రబాబు టీడీపీ కండువా కప్పి చేర్చుకున్నారు. వారికి పార్టీలో ప్రయారిటీ కూడా ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే వైసీపీ నేతలను టీడీపీ లో చేర్చుకునేందుకు చంద్రబాబు దగ్గర లోకేష్ విముఖత చూపుతున్నారనే వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వైసీపీ నుంచి వస్తామనే వారిని తొందరపడి పార్టీలోకి చేర్చుకోవద్దని బాబు గారిని లోకేష్ ఒప్పించారని అంటున్నారు.
జగన్ దగ్గర భంగపడిన చాలామంది వైసీపీ నేతలు కూటమిలో తమకి పరిచయమయిన వారితో చంద్రబాబు, లోకేషుల దగ్గరకి రాయబారం పంపుతున్నారట. తాము టీడీపీ లో చేరేందుకు సిద్దమనే సంకేతాలు పంపుతున్నారట. మరికొంతమంది లోకేష్ ని కలిసి వైసీపీ ని వీడి టీడీపీ లో చేరేందుకు సిద్దమవుతున్నప్పటికీ.. లోకేష్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా టాక్ వినబడుతుంది.
వైసీపీ లో ఉండి టీడీపీ పై విపరీతంగా రెచ్చిపోయి మాటలన్న నేతలను టీడీపీ కి కాస్త దూరంగానే ఉంచాలని, వారు ఎంతగా ప్రాదేయపడినా టీడీపీ లో చేర్చుకునేందుకు సిద్ధంగా మేము లేమనే సంకేతాలు లోకేష్ కూడా పంపుతున్నాడట. ఇప్పటికే జగన్ నుంచి డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్న ఆమంచి కృష్ణ మోహన్, మరికొంతమంది వైసీపీ నేతలు టీడీపీ లో చేరేందుకు మార్గాలను వెతుకుతున్నారట. మరి లోకేష్ ఎవరి బెండు ఎలా తియ్యాలో పక్కాగా లెక్కలు వేసుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తుంది వ్యవహారం.