శ్రీలీల సినిమా సెట్స్ లో కన్నా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నితిన్ రాబిన్ హుడ్ సెట్స్ లో సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న ఈ లేడీ బాస్ రవితేజ తో ఓ సినిమాని మొదలు పెట్టింది. అది ఇంకా పట్టాలెక్కలేదు. రవితేజ మిస్టర్ బచ్చన్ ఫినిష్ చెయ్యగానే శ్రీలీల షూటింగ్స్ తో బిజీ అవుతుంది.
అయితే కొద్ధిరోజులుగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రిపై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు శ్రీలీల ఆఫర్ కి అనన్య పాండే చెక్ పెట్టబోతోంది అంటున్నారు. మరోపక్క అమ్మడుకి తమిళ ఆఫర్స్ వస్తున్నాయి. అవి ఇంకా ఓకె చెయ్యని శ్రీలీల ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
తాజాగా ఎల్లో శారీ లో బ్యూటిఫుల్ లుక్స్ తో కిల్లింగ్ ఫోజులతో చంపేసింది. ఎల్లో కలర్ రకుల్ టైప్ శారీ లో శ్రీలీల అమయాకపు చూపులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం శ్రీలీల న్యూ లుక్ నెట్టింట సంచలనంగా మారింది.