Advertisement
TDP Ads

టెన్షన్ గా ఎదురు చూస్తున మెగా ఫ్యాన్స్

Thu 11th Jul 2024 08:16 PM
mega fans  టెన్షన్ గా ఎదురు చూస్తున మెగా ఫ్యాన్స్
Mega fans are waiting with tension టెన్షన్ గా ఎదురు చూస్తున మెగా ఫ్యాన్స్
Advertisement

మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే భారతీయుడు 2 చిత్రం టాక్ గురించి మెగా అభిమానులు చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. భారతీయుడు కి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 పై అంచనాలు మాములుగా లేవు. హీరో కమల్ హాసన్, సిద్దార్థ్, శంకర్ లు సినిమాని చాలా డీప్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ పరంగా కష్టపడ్డారు..,

భారతీయుడు 2 రిజల్ట్ విషయంలోనే మెగా ఫ్యాన్స్ ఉత్కంఠతో, టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. భారతీయుడు 2 హిట్ అయితే రామ్ చరణ్ తో శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ పై పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. అదే భారతీయుడు 2 రిజల్ట్ తేడా కొడితే కొంప కొల్లేరవుతుంది అనేది మెగా ఫ్యాన్స్ ఆందోళన. 

అందుకే భారతీయుడు 2 హిట్ అవ్వాలని వారు చాలా కోరుకుంటున్నారు. కమల్ హాసన్-శంకర్ కి ఈ సినిమా హిట్ ఎంత అవసరమో.. మెగా ఫ్యాన్స్ కి అంతే అవసరం అన్నట్టుగా అంది ప్రస్తుత పరిస్థితి. గేమ్ చేంజర్ ని మూడేళ్ళుగా శంకర్ సెట్స్ మీదనే ఉంచారు. ఆ సినిమా తో చరణ్ ఖచ్చితంగా హిట్ కొట్టాలని వారి కోరిక. అందుకే ఈ సినిమా రిజల్ట్ పై గేమ్ చేంజర్ భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటూ వారు మాట్లాడుకుంటున్నారు. 

Mega fans are waiting with tension:

Mega Fans Eagerly Waiting For Indian 2

Tags:   MEGA FANS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement