సెప్టెంబర్ 27 అంటూ అక్టోబర్ 10 నుంచి ఓ రెండు వారాలు ముందుకు జరిగిన ఎన్టీఆర్-కొరటాల దేవర చిత్రం షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఓ పది రోజుల షూటింగ్ మినహా రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్న దేవర చిత్రాన్ని కొరటాల పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు.
అయితే దేవర విడుదలకు రెండు నెలల సమయమే ఉంది.. ఇంకా పబ్లిసిటీ పనులు మొదలు కాకపోతే ఎలా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. ఈలోపులో దేవర చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్న జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేసినట్టుగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసి ఎన్టీఆర్ అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు.
ఒకపక్క షూటింగ్ ఫినిష్ చేస్తూనే కొరటాల పోస్ట్ ప్రొడక్షన్ అలాగే డబ్బింగ్ పనులు కూడా చకచకా ఫినిష్ చేస్తున్నారంటూ వారు హ్యాపీ మోడ్ లోకి వెళుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇతర కీలక నటులపై కొరటాల షూటింగ్ చిత్రీకరణలో బిజీగా వున్నారు. ఆ తర్వాత సాంగ్స్ కోసం దేవర టీమ్ విదేశాలకి వెళ్లనుంది.