నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోను రష్మిక మందన్న పేరు యమా జోరు మీదుంది. హిందీ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ లో నటిస్తుంది. అంతేకాదు ఇప్పుడు రెండు పాన్ ఇండియా మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గని రష్మిక ప్రస్తుతం ధనుష్ కుబేర, అల్లు అర్జున్ పూష ద రూల్ మూవీస్ షూటింగ్స్ ఫినిష్ చేసే పనిలో ఉంది. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కదం తొక్కుతుంది. వరస సినిమాలు, అయినా జిమ్ వర్కౌట్స్ తో బాడీని మాంచి ఫిట్ నెస్ తో మైంటైన్ చేసే రష్మిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా రష్మిక వదిలిన లుక్ చూస్తే మతి పోవాల్సిందే. లైట్ కలర్ డిజైనర్ శారీ లో రష్మిక లుక్ కొత్తగా కాదు సరికొత్తగా కనిపించింది. చీర లోను రష్మిక అందాలు ఆరబోసిన తీరుకి యూత్ కి నిద్రపడితే ఒట్టు. మెడ ని ఖాళీగా వదిలేసి చెవులకి పెట్టిన జుంకాలతో రష్మిక మాత్రం నిజంగా అదరగొట్టేసింది.