అవును.. అక్షరాలా వైసీపీకి సిగ్గు రాలేదు..! 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి బూతులు, ఇష్టానుసారం మాట్లాడటం అనేది ఒక కారణం..! ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజం అంతే. ఫలితాల తర్వాత అయినా ఇలాంటివి తగ్గించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది కానీ ఇంకా మారలేదు..! బహుశా మార్పు ఆశించడం కూడా ఆ పార్టీ కార్యకర్తలు, నేతల తప్పేమో..! నాడు బూతు మంత్రులు, ఇతర నేతలు.. ఇప్పుడేమో అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు వైసీపీని సర్వ నాశనం చేస్తున్నారని సొంత మనుషులే తిట్టు పోస్తున్న పరిస్థితి..!
ఇంతకీ ఏం జరిగింది..?
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనే వ్యక్తి గుర్తుండే ఉంటాడు కదా..! అదేనబ్బా అపరమేధావి, వైసీపీ నా వాళ్ళే ఈ పరిస్థితికి వచ్చిందని టీవీల్లో, ట్విట్టర్ ఇలా అనవసర విషయాల్లో తలదూర్చి లేనిపోని పంచాయతీలు పెట్టుకునే వ్యక్తి..! ఎంతలా ఇప్పటివరకూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఎన్ని సార్లు తిట్టేసి.. ఆఖరికి కొట్టడానికి వెళ్లారో కూడా తెలియదు..! అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇతని ఓవర్ యాక్షన్ బాబోయ్ మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే..! ఇప్పుడు అధికారం పోయింది కాస్త అణిగిమణిగి ఉండాలి.. కానీ అంతకు డబుల్ రెచ్చిపోతున్నాడు..! తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కారు కూతలు కూశాడు..! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అయితే ఏకంగా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌తో పోల్చడం గమనార్హం. అది కూడా ఎమ్మెల్యేకు తక్కువ అని.. సీఎంను పట్టుకుని తిట్టిపోయడం అవసరమా..? అనేది వారి విజ్ఞతకే వదిలేయాలి మరి.
చిప్ దొబ్బిందా..?
ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టానుసారం వాగడమేంటి..? విమర్శలకు, ఆరోపణలు హద్దూ పద్దు ఉండక్కర్లేదా..? ఇలా చేసే కదా.. వైసీపీ సర్వనాశనం అయ్యిందనే విషయం మరిచిపోతే ఎలా..? కొడాలి నాని, రోజా, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్‌లాంటి వారికి ఏ పరిస్థితి వచ్చిందనేది ఇప్పటికీ తెలుసుకోకపోతే అసలుకే ఎసరు రావొచ్చు సుమీ. ఇప్పుడు క్రికెట్ టీమ్.. రానున్న రోజుల గురించి కూడా ఊహించుకోవాలి కదా..! ఇప్పటికైనా వైసీపీ బుద్ధి తెచ్చుకుని, చిప్ కాస్త సరిచేసుకుని మరీ ముఖ్యంగా అధికార ప్రతినిధులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాపోతున్నది వైసీపీ క్యాడర్. దీంతో పాటు.. డిబెట్స్, మీడియా ముందుకు వచ్చే ముందు కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని వస్తే మరీ మంచిది సుమీ...!