రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ చేసేసి ఫ్రీ అయ్యారు. ఆ సినిమా విడుదల తేదీని దర్శకుడు శంకర్ కి వదిలేసి రామ్ చరణ్ మాత్రం కూల్ అయ్యారు. తాజాగా చరణ్ భార్య ఉపాసన, కుమార్తె క్లింకార తో కలిసి ముంబై బయలుదేరాడు. ఈ రోజు ఉదయం బేగం పేట ఎయిర్ పోర్ట్ నుంచి రామ్ చరణ్ దంపతులు స్పెషల్ ఫ్లైట్ లో ముంబై కి బయలుదేరారు.
చరణ్ సడన్ గా ముంబై వెళ్ళడానికి కారణం అక్కడ ముఖేష్ అంబానీ-నీత అంబానీ ల కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జరగబోతుంది. ముంబై వేదికగా జులై 12 న జరగబోయే అంబానీల వివాహం కోసం రామ్ చరణ్ ఉపాసనలు కుమార్తె క్లింకార తో సహా ముంబైకి బయలుదేరి వెళ్లారు. వీరు గతంలో అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కోసం కూడా వెళ్లారు.
అప్పుడు కూతుర్ని తీసుకెళ్లకపోయినా.. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లికి మాత్రం కూతురు క్లింకార తో సహా హాజరవుతున్నారు. ఉపాసన ఎప్పటిలాగే కూతురు మొహం మీడియాకి కనిపించకుండా కవర్ చేస్తూ కారు దిగి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం చరణ్-ఉపాసనలు ఫ్లైట్ ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.