హీరో రాజ్ తరుణ్ పై లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనని మోసం చేసి వేరే హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడు అంటూ లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. 2007 లోనే రాజ్ తరుణ్ తో పరిచయమవ్వగా 2010 లో తనకి రాజ్ తరుణ్ ప్రపోజ్ చేసాడు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఓ టెంపుల్ వివాహం చేసుకున్నాము, ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రెగ్నెంట్ రాగా అది అబార్షన్ అవడంతో హాస్పిటల్ ఫీజులు కూడా రాజ్ తరుణ్ చెప్పించాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పై పక్కా ఆధారాలతో కంప్లైంట్ చేసింది.
దానితో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసారు. అంతేకాకుండా లావణ్యని బెదిరించిన విషయంలో తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు పై కూడా పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గానే మాల్వి మల్హోత్రా తనకి లావణ్య ఎవరో తెలియదు ఆమె నన్ను ఫోన్ చేసి తిడుతుంది. రాజ్ తరుణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. లావణ్య నా పేరెంట్స్ ని కూడా బెదిరిస్తోంది అని చెప్పింది.
కట్ చేస్తే నార్సింగ్ పోలీసులు లావణ్య కేసులో రాజ్ తరుణ్ ని A 1 నిందితుడిగా, మాల్వి మల్హోత్రాని A 2 నిందితురాలిగా, ఆమె సోదరుడిని A 3 నిందితుడిగా కేసు నమోదు చేసారు. లావణ్యని మాల్వి ఆమె సోదరుడు బెదిరించిన కేసు కూడా నమోదు అయ్యింది. మరి ఈ కేసులో నుంచి రాజ్ తరుణ్ ఎలా బయటపడతాడో అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.