సోషల్ మీడియా మొత్తం యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు గురించే మాట్లాడుకుంటున్నారు. యూట్యూబర్ గా పాపులర్ అయిన ప్రణీత్ హనుమంతు చిన్న పిల్లల విషయంలో వల్గర్ కామెడీ చేసి నెటిజెన్స్ కి అడ్డంగా బుక్ అయ్యాడు. సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ లాంటి వాళ్ళు ప్రణీత్ హన్మంతు వెటకారపు కామెడీపై వెలుగెత్తి చాటటమే కాదు అతనిపై యాక్షన్ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప మైఖ్యమంత్రి మల్లు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు.
దానితో తెలంగాణ ప్రభుత్వం ప్రణీత్ హన్మంతుపై యాక్షన్ కి రెడీ అవడమే కాదు నిన్న బెంగుళూరులో ప్రణీత్ తో సహా మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుంది. అయితే ప్రణీత్ హనుమంతు విషయంలో అన్న అజయ్ హనుమంతు రియాక్ట్ అయ్యాడు. అజయ్ కూడా ప్రముఖ యూట్యూబరే. తప్పు ఎవరు చేసినా తప్పే. అది తమ్ముడైనా, అన్నయినా తప్పు తప్పే. వారికి శిక్షపడాలి తాను ఇలాంటి అడల్ట్ కామెడీని ప్రోత్సహించను.
నాకు ఆరేళ్ళ క్రితమే పెళ్లయ్యింది. ఈ శుభవార్తని ఓ సంతోషకరమైన రోజున చెప్ప్పాలనుకున్నాను కానీ.. ఇలాంటి సమయంలో బయటపెట్టాల్సి వచ్చింది. నేను ఓ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకునైనా రోడ్డు మీద నుంచే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంజినీరింగ్ పూర్తి కాగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లైఫ్ లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. జీవనోపాధిలేక కష్టపడ్డాను.
అడల్ట్ కామెడీని చూడను, నేను ప్రోత్సహించను. ఆ విషయంలో మీరెంత దూరంగా ఉన్నారో నేను అంతే.. అంటూ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ పై ఆయన సోదరుడు అజయ్ స్పందించాడు.