బిగ్ బాస్ సీజన్ 1 నుండి నాలుగైదు సీజన్స్ వరకు తెలుగులో బిగ్ బాస్ ని బుల్లితెర ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కానీ గత కొన్ని సీజన్స్ కి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గింది అనే చెప్పాలి. హోస్ట్ నాగార్జున కొత్తగా ప్రయత్నం చేస్తున్నా కొంతమంది కంటెస్టెంట్స్ ముందే షో మీద బాగా ప్రిపేర్ అయ్యి గేమ్ ఆడేస్తున్నారు. మరికొంతమంది ప్రేక్షకులని ఇరిటేట్ చేస్తున్నారు.
అయినప్పటికి బిగ్ బాస్ యాజమాన్యం ప్రతి సీజన్ ని ఏంతో కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు సిద్దమవుతూనే ఉంది. మరి ఈ సీజన్ అంటే బిగ్ బాస్ 8 కి హోస్ట్ గా కొత్త హీరో వస్తారని ప్రచారం జరిగినా ఫైనల్ గా నాగార్జునే సీజన్ 8 కి హోస్ట్ అని తెలుస్తోంది. మరోపక్క అన్నపూర్ణ స్టూడియో లో బిగ్ బాస్ 8 హౌస్ రెడీ అవుతుంది
ఇక సోషల్ మీడియా లో చాలామంది బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నారంటూ రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ పై యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చేసింది అంటున్నారు. అందులో పాపులర్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి, ఫుడ్ తో తెగ ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేర్లు మార్మోగిపోతున్నాయి.
అలాగే జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్ కిర్రాక్ ఆర్పీ, బర్రెలక్క, టీవీ ఆర్టిస్టులు తేజస్విని, అక్షిత, హారిక, సాయికిరణ్ ఇంకొంతమంది యుట్యూబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే లిస్ట్ లో ఉన్నట్లుగా టాక్. మరి ఈ ప్రచారంలో ఉన్న ఏయే పేర్లు హౌస్ లోకి అడుగుపెడతాయో చూడాలి.