సూపర్ స్టార్ మహేష్ ప్రతి ఏడాది ఫ్యామిలీతో కలిసి మూడు నాలుగు వెకేషన్స్ ప్లాన్ చేసుకుని... భార్య పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తున్నారు. నిన్నగాక మొన్న లండన్ నుంచి ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో దిగిన మహేష్ బాబు వచ్చాక కల్కి 2898 AD చిత్రాన్ని వీక్షించి టీమ్ ని తెగ పొగిడేశారు.
కట్ చేస్తే మహేష్ బాబు ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి జర్మనీలో కనిపించారు. మరి మహేష్ ఇలా ఫ్యామిలీతో కలిసి వెంట వెంటనే ట్రిప్స్ వెయ్యడం వెనుక ఆయన రాజమౌళి మూవీ సెట్స్ లోకి వెళ్లారంటే అసలు బ్రేక్ ఉండదు. అప్పుడు ఫ్యామిలీ ని మిస్ అవుతామనే భావన తోనే మహేష్ ఈ ఖాళీ సమయం మొత్తాన్ని ఫ్యామిలీ కేటాయించేసి వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారేమో అని మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ తన భార్య నమృత, కొడుకు గౌతమ్, కూతురు సితార తో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చారు. అది చూసాక అందరూ ఏంటి మహేష్ ఈ ట్రిప్స్.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఆయన బర్త్ డే కి రాజమౌళి మూవీ అప్ డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.