Advertisementt

గురూజీ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్

Wed 10th Jul 2024 09:57 PM
poonam kaur  గురూజీ పై పూనమ్ కౌర్  డైరెక్ట్ ఎటాక్
Poonam Kaur direct attack on Guruji Trivikram గురూజీ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తివిక్రమ్ పై నటి పూనమ్ కౌర్ చాలాసార్లు, చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసే పూనమ్ కౌర్ తాజాగా త్రివిక్రమ్ పై డైరెక్ట్ ఎటాక్ చేసింది. గురూజీ త్రివిక్రమ్ ని సోషల్ మీడియా వేదికగా ఏసుకుంది. 

అసలు ఇప్పుడు సడన్ గా పూనమ్ కౌర్ అంత ఘాటుగా రియాక్ట్ అవడానికి కారణం.. రీసెంట్ గా సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకర కామెంట్స్ తో రెచ్చిపోతున్న వారిపై హీరో సాయి ధరమ్ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చెయ్యడం, యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవడంపై అందరూ సాయి ధరమ్ తేజ్ ని తెగ ప్రశంసిస్తున్నారు 

అయితే సోషల్ మీడియాలో జల్సా సినిమాలోని కొన్ని సీన్స్ ని ట్రెండ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేస్తూ కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందులోని ఓ సన్నివేశంలో పవన్ బ్రహ్మి తో మాట్లాడిన ఓ డైలాగ్ పై పూనమ్ కౌర్ స్పందిస్తూ.. డైలాగ్స్ రాసింది త్రివిక్రమే… అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు.. ఆయన నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అంటూ ట్వీట్ చేసింది. 

మరి పూనమ్ కౌర్ ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ ని టార్గెట్ చెయ్యడం వెనుక అసలు కథ ఏమిటో అనేది కొంతమందికి తెలిసినా.. మరికొంతమందికి అసలేమైందో అర్ధం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. 

Poonam Kaur direct attack on Guruji Trivikram:

Poonam Kaur Vs Director Guruji storming social media

Tags:   POONAM KAUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ