గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. ఫస్ట్ పార్ట్ కి సంబందించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో ప్రస్తుతం దేవర ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది.
ఇక ఈ షెడ్యూల్ పూర్తి కాగానే దేవర సాంగ్స్ చిత్రీకరణ కోసం హీరో ఎన్టీఆర్-హీరోయిన్ జాన్వీ కపూర్ లు కొరటాలతో సహా విదేశాలకి వెళ్లిపోతారు. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కొరటాల పాటలను చిత్రీకరించనున్నారు. వాటితో పాటుగా మరో వారానికి పైగా షూటింగ్ మాత్రమే దేవర కి బ్యాలన్స్ ఉంటుందట.
సో ఎలా లేదన్నా ఈ నెల చివరి వారానికల్లా దేవర షూటింగ్ పూర్తయితే ఆగష్టు మొత్తం కొరటాల దేవర పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయించి సెప్టెంబర్ లో సినిమాలో రిలీజ్ అయ్యేవరకు ప్రమోషన్స్ తో పిచ్చెక్కించే ప్లాన్ లో కొరటాల ఉన్నారట. సో దేవర పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా సెప్టెంబర్ 27 న విడుదలయ్యే దేవర ని చూసి ఎంజాయ్ చెయ్యడమే మిగిలింది.