గత నెల రోజులుగా తెలంగాణలో అందులోను హైదరాబాద్ రెస్టారెంట్స్, హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి బోలేడన్ని రెస్టారెంట్స్ కి నోటీసు లు ఇవ్వడం ప్రతి రోజు టివి ఛానల్స్, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ లో పలు రెస్టారెంట్స్ లో కాలం చెల్లిన ఆహారపదార్ధాలు, కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా నిల్వ చేసిన ఆహారపదార్ధాలు కస్టమర్స్ కి వడ్డించడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అవుతున్నారు.
తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు టాలీవుడ్ హీరో రెస్టారెంట్ పై రైడ్ చెయ్యగా.. అక్కడ డేట్స్ అయ్యిపోయిన బియ్యం, అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ దొరకడం హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరిట కొంతమంది తో కలిసి రెస్టారెంట్స్ ఓపెన్ చేసారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ఇలా పలు చోట్ల వివాహ భోజనంబు రెస్టారెంట్స్ ఓపెన్ చేసారు.
ఈ రెస్టారెంట్స్ పై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా సికింద్రాబాద్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో డేట్ అయిపోయిన చిట్టి ముత్యాల బియ్యంతో పాటుగా సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరిని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కిచెన్ డస్ట్ బిన్స్ పై మూతలు లేకుండా ఉండడం..
అక్కడ వంట చేసే వారికి హెల్త్ రిపోర్ట్స్ లేకపోవడం, ముందుగా రెడీ చేసిన ఫుడ్ కి ఎక్స్పైరీ లేకపోవడం వంటి వాటిని గుర్తించి వివాహ భోజనంబు రెస్టారెంట్ కి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.