Advertisementt

హీరోగా కాదు అతిధిగా వస్తున్న మోక్షజ్ఞ

Wed 10th Jul 2024 01:01 PM
mokshagna  హీరోగా కాదు అతిధిగా వస్తున్న మోక్షజ్ఞ
Mokshagna is coming not as a hero but as a guest హీరోగా కాదు అతిధిగా వస్తున్న మోక్షజ్ఞ
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై గత వారం రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ లు రావడం కాదు.. మోక్షజ్ఞ హీరో లుక్ తెగ వైరలవుతుంది. హీరో లుక్ లో మోక్షజ్ఞ నందమూరి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు. సూపర్బ్ హ్యాండ్ సమ్ లుక్ లో మోక్షజ్ఞ హీరో అవ్వకముందే సోషల్ మీడియాని కబ్జా చేసాడు.

అంతేకాదు అమ్మాయిల కలల రాకుమారుడిలా మారిపోయాడు. ఇక మోక్షజ్ఞ న్యూ లుక్ ఇలా సోషల్ మీడియాలో కనిపించిందో లేదో.. మోక్షజ్ఞ తెరంగేట్రం మూవీపై రకరకాల వార్తలు వాడుకలోకి వచ్చేసాయి. ముఖ్యంగా మోక్షజ్ఞ ని ప్రశాంత్ వర్మ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చెయ్యబోతున్నాడంటూ ప్రచారం మొదలయ్యింది.

కానీ తాజా వార్తల సారాంశం మోక్షజ్ఞ ముందుగా హీరోగా కాకుండా అతిధి పాత్రతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడట. అది కూడా తండ్రి బాలకృష్ణ నటించే సినిమా నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అని తెలుస్తోంది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కబోయే అఖండ 2 మూవీలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు.

ఇది నందమూరి అభిమానులకి ఒక రకంగా గుడ్ న్యూస్, మరో రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చెయ్యాలని వారు కలలు కంటుంటే.. అతిధి పాత్ర అంటూ నిరాశపరుస్తున్నా.. ఎలాగోలా సిల్వర్ స్క్రీన్ పై మోక్షజ్ఞని చేసేందుకు వారు రెడీగా ఉన్నారు. 

Mokshagna is coming not as a hero but as a guest:

Speculation On Mokshagna Special Role

Tags:   MOKSHAGNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ