కల్కి 2898 AD చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతుంది. బద్దకంగా ఉన్న బాక్సాఫీసును పరుగులు పెట్టిస్తున్న కల్కి చిత్రం 1000 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, దీపికా పదుకొనే లు నటించిన కల్కి చిత్రానికి విడుదలయిన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, ఫస్ట్ హాఫ్ నచ్చలేదు అన్నా, మ్యూజిక్ బాలేదు అన్నప్పటికీ.. ఈ చిత్రానికి ఆ తర్వాత వినిపించిన మౌత్ టాక్ కల్కి ని 1000 కోట్లకి చేరువ చేసింది.
చాలామంది వీకెండ్స్ లో కల్కి ని థియేటర్స్ లో చూసి ఎక్స్ పీరియన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యూత్ అయితే కల్కి 3D లో వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కల్కి చిత్రం జూన్ 27 న థియేటర్స్ లో విడుదల కాగా.. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
కల్కి 2898 AD చిత్రాన్ని రెండు ప్రముఖ ఓటీటీ సంస్థల డిజిటల్ హక్కులని సంపాదించాయి. అందులో సౌత్ భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. నార్త్ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ రెండు ఓటీటీ ల నుంచి కల్కి ఆగష్టు 15 న స్ట్రీమింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.
ఆగష్టు 15 అంటే లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది అని.. మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు. థియేటర్స్ లో విడుదలైన ఏడెనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చెయ్యాలనే ఒప్పందం మీదే మేకర్స్ కల్కి రైట్స్ విక్రయించినట్లుగా తెలుస్తోంది. మరి ఓటీటీ డేట్ పై మేకర్స్ ఆలోచన ఎలా ఉందో తెలియాల్సి ఉంది.