వెకేషన్ కి రామ్ చరణ్..

రామ్ చరణ్ మూడేళ్ళుగా చేస్తూ వస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఎట్టకేలకు ముగించారు. రెండు రోజుల క్రితమే గేమ్ చెంజర్ షూటింగ్ ఫినిష్ చేసిన రామ్ చరణ్ ఇకపై బుచ్చిబాబు తో చెయ్యాల్సిన మూవీ సెట్స్ లో జాయిన్ అవుతారని అనుకున్నారు. ఎందుకంటే చాలా రోజులుగా బుచ్చి బాబు అండ్ టీం చరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

బుచ్చి బాబు రామ్ చరణ్ తో RC 16 పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కోసం వెయిట్ లో ఉన్నాడు. ఇంకేముంది చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ అయ్యింది.. ఇకపై RC 16 షూటింగ్ లో జాయిన్ అవడమే మిగిలింది అనుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ అప్పుడే బుచ్చిబాబుతో చెయ్యాల్సిన కొత్త మూవీ సెట్స్ లోకి వెళ్లడం లేదట. కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట.

అదే విషయం బుచ్చిబాబు తో చెప్పి ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లింకార తో కలిసి వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారట. అక్కడి నుంచి వచ్చాక పూర్తిగా బుచ్చి బాబు మూవీ కోసం ప్రిపేట్ అవుతారని, అందులో భాగంగానే చరణ్ ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ స్పెషల్ మేకోవర్ అవుతారని తెలుస్తోంది.  

Ram Charan wraps filming for Shankar Game Changer

Ram Charan for vacation?
ram charan