బాలయ్య Vs హోం మంత్రి.. సీఎంవోలో రచ్చ!
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను.. హోం మంత్రి వంగలపూడి అనిత లెక్క చేయట్లేదా..? అసలు ఆయన స్వయంగా ఫోన్ చేసినా సమస్యకు పరిష్కారం లభించలేదా..? అన్యాయాన్ని ఎదురిస్తే.. ఇలా చేయడం తప్పు కదా అని చెబితే మంత్రి నొచ్చుకున్నారా..? అంటే రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమే అనిపిస్తోంది.
ఏం జరిగింది..?
అన్నవరంలో వన్ అనే రెస్టారెంట్ లోకి వెళ్లిన హోం మంత్రి అనిత అనుచరులు, టీడీపీ నేతలు ఇటీవల వెళ్ళారు. పోయిన వాళ్ళు ఏం చేయాలి..? ఏదో ఒకటి ఆర్డర్ చేసి తినాలి.. కానీ ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా అక్కడే గంటల తరబడి కూర్చున్నారు. ఏం కావాలి సార్ అని అడిగితే ఆర్డర్ ఇవ్వకపోగా తొలుత వెయిటర్లను బెదిరించి నానా రచ్చ చేశారు. ఇక హోటల్ యజమాని రంగంలోకి దిగి పీక్ టైంలో ఆర్డర్ ఇవ్వకపోగా.. గంటల తరబడి కూర్చుంటే నష్టపోతామని చెప్పగా.. ఇక రెచ్చిపోయిన అవతలి వ్యక్తులు మేనేజర్, సిబ్బందితో ఘర్షణకు దిగారు. అడ్డొచ్చిన వాళ్ళను చితకబాదేశారు.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. హోటల్ యజమాని బాలయ్యకు బాగా తెలిసిన, కావాల్సిన వ్యక్తి కావడంతో.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఇక బాలకృష్ణ.. నేరుగా హోం మంత్రికే ఫోన్ చేశారట.
గొడవ సద్దుమణగలే!!
బాలయ్య నుంచి ఫోన్ రాగానే ఏం జరిగిందో అని లిఫ్ట్ చేసిన అనిత.. విషయం అంతా విని అలాగే సర్.. మాట్లాడుతానని చెప్పి మిన్నకుండిపోయారట. ఇదంతా జరిగిన తర్వాత కూడా అదే హోటలుకు వెళ్లి మరింత రేచ్చిపోయారట. దీంతో హోటల్ యజమాని నుంచి మళ్లీ బాలయ్యకు ఫోన్ వచ్చిందట. నేను చెప్పినా మళ్ళీ గొడవలు ఏంటి..? అసలు నా మాట లెక్క చేయకపోవడం ఏంటి..? అని తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆయన ఇక నేరుగా సీఎంవోకి కాల్ చేశారట. ఈ గొడవ సద్దుణిగలేదట.
ఎన్నెన్ని గొడవలో..!
వాస్తవానికి ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎన్నెన్ని గొడవలు జరిగాయో.. ఇంకా జరుగుతున్నాయో ఒక్కసారి సోషల్ మీడియాలో లుక్కేస్తే తెలుస్తుంది. వీటిలో ఎన్నింటిపై కేసులు నమోదు అయ్యాయో లెక్కే లేదు. ఇక గొడవల తాలుకా వీడియోలు మంత్రిని ట్యాగ్ చేసిన ఘటనలు ఐతే కోకొల్లలు. మంత్రి సొంత నియోజకవర్గంలో ఐతే పట్ట పగలే ఎన్నో ఘటనలు జరిగాయి. ఇప్పుడిక బాలయ్య ఫిర్యాదు వ్యవహారం బయటికి వచ్చింది. సీఎంవోలో ఉన్న ఈ పంచాయతీకి ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఐనా.. అనిత సొంత మనుషుల మీద కేసులు పెట్టడం.. పోనీ కేసులు నమోదు చేసినా నిలబడతాయా అన్నది ఆలోచించాల్సిన విషయమే అని సొంత పార్టీ నేతలే చెపుతున్న పరిస్థితి.. సీఎంవోలో ఏం జరుగుతుందో చూడాలి మరి.