టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హరీష్ శంకర్ అనే చెబుతారు. కొన్నాళ్లుగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు ఆయనపై ఎవరు కామెంట్ చేసినా వారికి ఫుల్ గా ఇచ్చిపడేసే హరీష్ శంకర్ తాజాగా టాలీవుడ్ లో ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యాడు.
రిలీజ్ దగ్గర పడుతోంది కదా, ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడు అని.. ఒక ముసలి నక్క మళ్లీ మొదలు పెడుతోంది. దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను అంటూ పేరు పెట్టకుండా ఆ జర్నలిస్ట్ కి హరీష్ శంకర్ ఓ విధంగా వార్నింగ్ ఇచ్చేసాడు.
మరి ఇప్పుడు హరీష్ శంకర్ వార్నింగ్ ఇచ్చిన ఆ టాలీవుడ్ ముసలి జర్నలిస్ట్ ఎవరా అని అందరూ హరీష్ శంకర్ కి కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది హరీష్ శంకర్ కి సపోర్ట్ గా నువ్వు తగ్గొద్దు అన్నా ఇలానే ఇచ్చిపడేయ్ అంటూ మాట్లాడుతున్నారు.