ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ ఆయన కొడుకు కేటీఆర్లు మంచి దోస్త్ లు. వీరిద్దరూ కలిసి అధికారంలోకి రాగానే చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై ఓటుకు నోటు కేసులు పెట్టి బెదిరించాలని చూసారు. జగన్-కేసీఆర్ పరస్పర ఒప్పందాలతో గత ఐదేళ్లు పాలన సాగించారు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో దోస్తులిద్దరూ ఓడిపోయారు.
ఏపీ ఎలక్షన్స్ ముగిసాక తనకి జగన్ గెలుస్తాడని రిపోర్ట్స్ అందాయంటూ కేసీఆర్ చెప్పుకొచ్చాడు. అదలా ఉంటె తాజాగా 2024 ఎన్నికల్లో ఓడిపోయాక తాము ప్రజలకి బోలెడన్ని సంక్షేమ పథకాలు అందించాము, ప్రజలకి మంచి చేసి ఓడిపోయాము, అక్క చెల్లెల్లు, అవ్వ తాతల ఓట్లెందుకు వెయ్యలేదో అంటూ బిక్కమొహం పెట్టాడు. తాజాగా కేటీఆర్ కూడా దోస్త్ జగన్ ఎందుకు ఓడిపోయాడో అంటూ విశ్లేషిస్తున్నారు.
అయన మీడియాతో మట్లాడుతూ ఆంధ్రలో జగన్ ప్రజలకి బోలేడన్ని సంక్షేమ పథకాలిచ్చి ఎందుకు ఓడిపోయాడో అర్ధం కావడం లేదు, అంతేకాదు.. ప్రతి రోజు ప్రజల మద్యన కనిపించే ధర్మవరం వైస్సార్సీపీ నేత కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడో అర్ధం కావడం లేదు అని.. అక్కడ షర్మిల ని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసి ఓట్లు చీల్చడంలో కొంతమంది సక్సెస్ అయ్యారంటూ కేటీఆర్ జగన్ ఓటమిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.