జగన్ పులివెందుల ఎమ్యెల్యే స్థానానికి రాజీనామా చేసి అవినాష్ రెడ్డితో ఎంపీ స్థానానికి రాజీనామా చేయించి తాను ఎంపీగా పోటీ చేస్తాడంటూ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. జగన్ తన కేసులు బయటికి రాకుండా ఢిల్లీ లో కూర్చుని చక్రం తిప్పేలా ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
మరి ఈ రాజీనామా వార్తపై ఆఖరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. జగన్ రాజీనామా చేస్తారని అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే షర్మిలను గెలిపించేందుకు మా మంత్రులు, మేము సిద్ధమంటూ రేవంత్ రెడ్డి ఆంధ్ర వేదికగా ప్రకటించేసారు. మరి ఇంత జరుగుతున్నా జగన్ రాజీనామా వార్తలను జగన్ కానీ, వైసీపీ నేతలు ఖండించడం లేదు.
దానితో వైసీపీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజంగానే జగన్ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా.. ఒకవేళ చేస్తే జగన్ నిజంగానే ఎంపీగా పోటీ చేస్తారా.. అసలు ఈ వార్తలు పై జగన్ ఎందుకు రియాక్ట్ రావడంలేదు, వైసీపీ నేతలు ఎందుకు గమ్మునున్నారు, ఏం జరుగుతుందో అర్ధం కాక వైసీపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు.