Advertisementt

రాజ్ తరుణ్-లావణ్య మధ్యలో మస్తాన్

Tue 09th Jul 2024 12:44 PM
raj tarun  రాజ్ తరుణ్-లావణ్య మధ్యలో మస్తాన్
Mastan between Raj Tarun-Lavanya రాజ్ తరుణ్-లావణ్య మధ్యలో మస్తాన్
Advertisement
Ads by CJ

హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం కెరీర్ లో డౌన్ ఫాల్ లో ఉన్నాడు. వరస సినిమాలు రాజ్ తరుణ్ ని నిరాశపరుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాజ్ తరుణ్ సక్సెస్ కోసం ఎదురు చూడని రోజు లేదు. అయినా వరసగా సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్ త్వరలోనే తిరగబడరా సామి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో అతనిపై మాజీ లవర్ లావణ్య కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

గత నాలుగైదు రోజలుగా రాజ్ తరుణ్ -లావన్యల వ్యవహారం మీడియా ఛానల్స్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. లావణ్య మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి రాజ్ తరుణ్ పై తిరగబడరా సామీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై ఆరోపణలు చెయ్యడమే కాదు రాజ్ తరుణ్ మరికొంతమందితో ఎఫైర్స్ పెట్టుకున్నట్లుగా ఆరోపిస్తుంది. అంతేకాదు బిగ్ బాస్ ఫేమ్ అరియనతోను రాజ్ తరుణ్ క్లోజ్ గా ఉంటాడు, వారిది ఒక్క రోజు పరిచయమే అయినా క్లోజ్ అయ్యారు అంటూ మాట్లాడుతుంది. 

మరొపక్క రాజ్ తరుణ్ కూడా లావణ్య తో 2017లోనే విడిపోయాను. ఆమెకి డ్రగ్స్ అలవాటుంది, మస్తాన్ అనే వ్యక్తితో పరిచయముంది. ఆమె మస్తాన్ ని కూడా చీట్ చేసింది, ఇప్పుడు కూడా నా ఇంటి కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తుంది అంటాడు. అవును మస్తాన్ మా ఫ్రెండ్ అతను కామన్ ఫ్రెండ్.. అంటూ అంటూ లావణ్య చెబుతుంది. అటు మస్తాన్ కూడా రాజ్ తరుణ్.. లావణ్య తో ఉన్న స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నాడు. 

మా మద్యన స్నేహం తప్ప మరేది లేదు, లావణ్యతో నేను క్లోజ్ గానే ఉంటాను. ఆ విషయం రాజ్ తరుణ్ కి కూడా తెలుసు. మా మధ్య రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నట్టుగా ఏమి లేదు. లావణ్యపై డ్రగ్స్ కేసు వచ్ఛినప్పుడు దాని గురించి మాట్లాడేందుకు లావణ్య దగ్గరకి వెళ్ళేవాడిని, క్యాజువల్ గా కూర్చుని మట్లాడుకునేవాళ్ళం, నేను రాజ్ తరుణ్ ని లావణ్యని విడదీయాలని ఎప్పుడు అనుకోలేదు అంటూ మస్తాన్ చెబుతున్నాడు. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. 

Mastan between Raj Tarun-Lavanya:

Lavanya Sensational Comments On Raj Tarun

Tags:   RAJ TARUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ