Advertisementt

ఇది నిజమా.. మహేష్!!

Tue 09th Jul 2024 11:43 AM
ssmb 29  ఇది నిజమా.. మహేష్!!
Mahesh dual sensation with a twist in SSMB29 ఇది నిజమా.. మహేష్!!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఫ్యామిలీ తో సహా లండన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. గత పదిహేను రోజులుగా ఫ్యామిలిలో లండన్ లో టైమ్ స్పెండ్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి తో చెయ్యబోయే చిత్రం కోసం ప్రిపేర్ అవుతారా.. లేదంటే దానికి ఇంకాస్త టైమ్ ఉందా అనేది తెలియడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహెష్ పుట్టిన రోజు నాడు రాజమౌళి తమ కాంబో కి సంబంధించి కాన్సెప్ట్ వీడియో వదలుతారని మహేష్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 

మరోపక్క రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్త మహేష్ ఫ్యాన్స్ ని నిలువనియ్యడం లేదు. రాజమౌళి మహేష్ ని రెండు వేరియేషన్ ఉన్న పాత్రల్లో చూపించబోతున్నారని, అందులో ఓ పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా ప్రచారం షురూ అయ్యింది. ఇదొక అడ్వంచ‌ర‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని, అట‌వీ నేప‌థ్యంలో ఎక్కువ శాతం షూటింగ్ జ‌రుగుతుంద‌ని, ఈ చిత్రంలో మహేష్ కి విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో ఓ హీరో కనిపిస్తారంటూ ఏవేవో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 

మహేష్ డ్యూయెల్ సెన్సేషన్ అనేది మాత్రం మహేష్ అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. కారణం మహేష్ ఇన్నేళ్ల కెరీర్ లో ఇంతవరకు ద్విపాత్రాభినయం చెయ్యలేదు. అందుకే ఇది నిజమా మహేష్ అంటూ మహేష్ ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా రాజమౌళి అనౌన్సమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం మహేష్ మేకోవర్ అవుతున్నాడు. ఆయన కొత్త లుక్ కోసం కూడా మహేష్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. 

Mahesh dual sensation with a twist in SSMB29:

SSMB 29 is not just Mahesh dual sensation

Tags:   SSMB 29
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ