Advertisementt

అఖిల్ ధీర తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ అదే!!

Mon 08th Jul 2024 10:06 PM
nagarjuna  అఖిల్ ధీర తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ అదే!!
Akhil next movie confirmed? అఖిల్ ధీర తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ అదే!!
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని ఏజెంట్ చిత్రం తర్వాత చెయ్యబోయే ప్రాజెక్ట్ పై అక్కినేని హీరో ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ.. అభిమానులు, కామన్ ఆడియన్స్ మాత్రం చాలా ఆతృతగా కనబడుతున్నారు. అఖిల్ నెక్స్ట్ ఫిలిం పై ఎలాంటి అప్ డేట్ కనిపించకపోయినా.. అఖిల్ కొత్త సినిమాపై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. 

అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ధీర అనే పవర్ ఫుల్ యక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తాడని అన్నారు. కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పడు తాజాగా అఖిల్ ధీర తర్వాత చెయ్యబోయే ప్రాజెక్ట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అఖిల్ ధీర చిత్రం ఫినిష్ అయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే మరో చిత్రం ఓకె అయ్యిందట. 

అది కూడా కిరణ్ అబ్బవరం తో వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తో అఖిల్ ఓ ప్రాజెక్ట్ కి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రురల్ డ్రామాగా ఉండబోతుంది అని తెలుస్తోంది. ఇదంతా నాగార్జున చూసుకుంటున్నారట. మరి అఖిల్ ధీర అలాగే ఈచిత్రం వెంట వెంటనే పట్టాలెక్కాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. 

Akhil next movie confirmed?:

Nagarjuna lines up a film for Akhil?

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ