వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా ఊరూ.. వాడా ఘనంగా వేడుకలు చేసుకుంది..! అంతే రీతిలో భావోద్వేగాలు కూడా..! ఇడుపులపాయ వేదికగా వైఎస్సార్‌కు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. ఎందుకో వైఎస్ సతీమణి విజయమ్మ వలవలా ఏడ్చేశారు..! ఇదేమీ నటన కాదు.. సింపతీ అంతకుమించి కాదు.. ఎందుకంటే ఏ తల్లికైనా బిడ్డలు బాగుండాలనే.. కలిసుండాలనే ఉంటుంది కదా..! వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ చెల్లా చెదురుగా విడిపోయి, వేర్వేరు దారుల్లో వెళ్తుండటం.. ఇవన్నీ చూసిన తల్లి ఒక్కసారిగా గుక్కపట్టి ఏడ్చేశారు..!
ఎందుకిలా..?
కుటుంబం చెల్లా చెదురు కావడం, వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, షర్మిల రాజకీయ భవిష్యత్తు.. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని విషయాలు విజయమ్మ మదిలో ఉండిపోయాయి..! పైకి ఎప్పుడూ గంభీరంగా కనిపించే విజయమ్మ ఒక్కసారిగా ఇలా ఎక్కి ఎక్కి ఏడ్చేశారు..! అటు కుమారుడిని.. ఇటు కుమార్తెను హత్తుకుని కన్నీటి పర్యంతయ్యారు..! తన ఓర్పు, బాధ, ఆవేదన, బావోద్వేగం అన్నీ ఒక్కసారే కన్నీటి రూపంలో వచ్చేశాయన్నది వైఎస్ ఫ్యామిలీ అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. ఈ దృశ్యాలు చూసిన వైఎస్సార్ వీరాభిమానులు ఒకింత ఎమోషనల్ అయిపోయారు..!
మార్పు రాదా..?
వైఎస్ ఫ్యామిలీ ఒక బ్రాండ్.. ఇప్పుడే కాదు ఎప్పటికీ చెప్పుకునేలా వైఎస్సార్ పాలన, సంస్కరణలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ.... ఏదో లోటు. అది కన్నబిడ్డలేనన్నది విజయమ్మ వ్యథకు కారణం. ఎందుకంటే.. ఇద్దరు పిల్లలు రాజకీయ కీచులాట ఆడుతుండటం, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తగ్గేదేలా అంటూ విర్రవీగుతూ, మొండిగా ముందుకెళ్తూ ఉండటం.. ఇంకా ఇలా చెప్పాలంటే లెక్కలేనన్నే ఉన్నాయి.. ఇవే విజయమ్మకు రోదన మిగిల్చాయి. అయినా ఈ వయస్సులో ఇదంతా ఎవరికోసం భరించాలి..? అంటే ఇది కూడా పిల్లల కోసమే..! ఇంత జరిగిన తర్వాత అయినా షర్మిల-జగన్ ఒక్కటవుతారనే ఏదో చిన్న ఆశ ఆమెలో ఉండొచ్చేమో..! ఏదైతేనేం.. ఇద్దరి కలిసి ముందుకెళ్తే బాగుంటుందని విజయమ్మ గట్టిగానే కోరుకుంటున్నారు.. మరి ఇది అస్సలు అయ్యే పనేనా.. లేకుంటే అయ్యి తీరుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.. జస్ట్ వెయిట్ అండ్ సీ..!