Advertisementt

కాజల్ ఎక్కడ ?

Mon 08th Jul 2024 05:52 PM
kajal  కాజల్ ఎక్కడ ?
Kajal was not seen in Bharateeyudu 2 promotions కాజల్ ఎక్కడ ?
Advertisement
Ads by CJ

వచ్చే శుక్రవారమే ఇండియన్ 2 పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శంకర్-కమల్ హాసన్ కాంబోలో సిద్దార్థ్, కాజల్, రకుల్ ప్రధాన పాత్రల్లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఇండియన్ 2 చిత్రం పై భారీ అంచనాలున్నాయి. జులై 12 న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ యూనిట్ ఫుల్ స్వింగ్ లో నడిపిస్తుంది. ఇండియా నుంచి మలేషియా ఇలా పలు దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. 

ఇక్కడ ముంబై నుంచి చెన్నై, హైదరాబాద్ వరకు ఇండియన్ 2 ప్రమోషన్స్ లో శంకర్, కమల్, సిద్దార్థ్ కనిపిస్తున్నారు. హైదరాబాద్ ప్రమోషన్స్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ జాయిన్ అవడమే కాదు ఆమె అన్ని చోట్ల స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అయితే హీరో-దర్శకుడు, రకుల్, మిగతా వారు కనిపిస్తున్నా మరో హీరోయిన్ కాజల్ ఇండియన్ 2 ప్రమోషన్స్ లో కానరావడం లేదు. 

ఇండియన్ 2 ఆడియో లాంచ్ వేడుక చెన్నై లో జరిగినప్పుడు కాజల్ కూడా వచ్చింది. ఆతర్వాత ఏ ప్రమోషన్స్ లోను కాజల్ కనిపించలేదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈరోజు జరిగిన మీడియా మీట్ ఎందులోనూ కాజల్ లేదు. కేవలం రకుల్ ప్రీత్ ఒక్కటే సందడి చేస్తుంది. మరి కాజల్ ఏమైనట్టు. 

ఆమె ఏమైనా భారతీయుడు 2 లోని తన పాత్ర పై అలిగిందా, లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది ఆమె అభిమానులకి అంతుబట్టడం లేదు. మరి సినిమాలో కాజల్ పాత్ర పై క్లారిటీ రావాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే!

Kajal was not seen in Bharateeyudu 2 promotions:

Kajal avoids Bharateeyudu 2 promotions?

Tags:   KAJAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ