ఇంకేంటి రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యిపోయింది.. ఇక దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ రిలీజ్ ఇచ్చేస్తారని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశే మిగులుస్తున్నారు శంకర్. నేడు సోమవారం కమల్ హాడిన్ నటించిన ఇండియన్ 2 తెలుగు ప్రెస్ మీట్ లో భాగంగా దర్శకుడు శంకర్ ని ఈ ఏడాది గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుందా అని ప్రశ్నించారు మీడియా మిత్రులు.
దానికి దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ కి సంబంధించి రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యింది(ఆ విషయం రామ్ చరణ్ ఆల్రెడీ ఇన్స్టా ద్వారా ప్రకటించేసారు) ఇంకా పది పదిహేను రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అది అయ్యాక ఫైనల్ ఎడిటింగ్ కాపీ చూసాకే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇస్తామంటూ శంకర్ చెప్పారు. అంతేకాకుండా ఇండియన్ 2-గేమ్ చేంజర్ మూవీస్ ఒకేసారి చేసారు కాబట్టి క్వాలిటీ ఏమైనా తగ్గిందా అనగానే శంకర్ లేదండి.. ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాము, ఇండియన్ 2 వర్క్ మొత్తం కరోనా టైం లోనే ఫినిష్ అవడంతో గేమ్ చేంజర్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టగలిగామంటూ శంకర్ చెప్పారు.
ఇక రిలీజ్ డేట్ విషయంలో డిజ్ పాయింట్ అవడం మెగా ఫ్యాన్స్ వంతైంది. ఉదయం రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ అప్ డేట్ తో ఆనందపడిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు శంకర్ ఇచ్చిన ఆన్సర్ కి నిరాశ పడుతున్నారు. శంకర్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ త్వరలోనే లాక్ చేస్తామని చెబితే బావుండేది అని వారి వాదన. మరా తరుణం ఎప్పుడనేది ఇంకాస్త ఎదురు చూడాల్సిందే.!