అక్కినేని అఖిల్ ఈ పేరు వినిపించి చాలా రోజులైంది. అఖిల్ లాస్ట్ మూవీ ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చి 14 నెలలవుతుంది. అయినా అఖిల్ నెక్స్ట్ చిత్రం విషయంలో కిమ్మనకుండా కూర్చున్నాడు. అఖిల్ విషయంలో అక్కినేని అభిమానులు తెగ బెంగపెట్టేసుకున్నారు. నాగ చైతన్య వరస సినిమాలతో ముందుకెళ్ళిపోతున్నాడు. అఖిల్ ఇంకా నాలుగో చిత్రం దగ్గరే ఆగిపోవడం వారిని కలవర పెట్టేస్తుంది.
కింగ్ నాగార్జున చిన్న కొడుకు విషయంలో ఏం ఆలోచిస్తున్నారో అనేది వాళ్ళకి అంతుబట్టడం లేదు. అఖిల్ కూడా ఏ ఈవెంట్ లో కానీ, మారేదన్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై కానీ కనిపించి చాలా రోజులైంది. ఈమధ్యన సోషల్ మీడియా లో అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి అతి త్వరలోనే ప్రకటన రాబోతుంది అంటూ ట్వీటేశారు.
కానీ ఇంతవరకు అఖిల్ జాడ లేదు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ధీర మూవీ ని ఓకె చేసిన అఖిల్ ఆ సినిమాని పట్టాలెక్కించడానికి మీన మేషాలు లెక్కిస్తున్నాడు. కథ నచ్చలేదా, ఏజెంట్ రిజల్ట్ నుంచి కోలుకోలేదా, అసలు సినిమాలు చేస్తాడా, ఆపేస్తాడా, అఖిల్ ఏం ఆలోచిస్తున్నాడో అర్ధం కాక అక్కినేని అభిమానులు తల పట్టుకుంటున్నారు.
అక్కినేని అభిమానులే కాదు.. చాలామంది అనుకుంటున్నమాట ఒక్కటే. డిజాస్టర్ వచ్చింది కదా అని సైలెంట్ అయితే ఎట్లా, నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి కదా, అలా కాదు నేను ఆలోచించుకోవాలి అంటే ఆరు నెలలు సరిపోదా.. ఇంత కాలం వెయిట్ చెయ్యాలా అని మాట్లాడుకుంటున్నారు.