Advertisementt

మహారాజా ఓటీటీ డేట్ వచ్చేసింది!!

Mon 08th Jul 2024 01:23 PM
maharaja  మహారాజా ఓటీటీ డేట్ వచ్చేసింది!!
Maharaja OTT date has arrived!! మహారాజా ఓటీటీ డేట్ వచ్చేసింది!!
Advertisement
Ads by CJ

విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ మహారాజ. ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన ప్రతి భాషలో సూపర్ హిట్ టాక్ మాత్రమే కాదు.. క్రిటిక్స్ నుంచి సూపర్ హిట్ రివ్యూస్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి మహారాజ టీం తో కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేసారు. తెలుగులో ఉప్పెన చిత్రం తర్వాత విజయ్ సేతుపతి సినిమాలపై తెలుగు ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలయ్యింది. 

దానితో మహారాజ ని ఇక్కడ భారీగా విడుదల చేసారు. అందుకు తగ్గ భారీ ప్రమోషన్స్ చేసారు. అయితే థియేటర్స్ లో మంచి హిట్ అయిన మహారాజ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని ఫ్యామిలి ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మహారాజ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 

జూన్ 14 న థియేటర్స్ లో విడుదలైన మహారాజ చిత్రంను జులై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తేనున్నట్లుగా అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. అంటే వచ్చే శుక్రవారం నుంచి మహారాజ చిత్రం విడుదలైన ప్రతి భాషలోనూ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

Maharaja OTT date has arrived!!:

Maharaja OTT Release Date Locked

Tags:   MAHARAJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ