ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. మూడేళ్ళుగా ఎదురు చూసిన తరుణం ఇన్నాళ్ళకి ఆసన్నమైంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ చెయ్యడమే కాదు.. కొన్ని పిక్స్ ని షేర్ చేసాడు. హెలికాప్టర్ల వైపు నడుస్తున్న రెండు డిఫ్రెంట్ చిత్రాలను ఇన్స్టా లో పోస్ట్ చేశాడు.
ఆ పిక్స్ లో ఒకటి సినిమాలోనిది, మరొకటి గేమ్ చేంజర్ షూట్ పూర్తయిన తర్వాత తీసిన పిక్. పైగా ఈ పిక్స్ కి గేమ్ మారబోతోంది అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అంతేకాదు గేమ్ చేంజర్ యూనిట్ కూడా మా గేమ్ ఛేంజర్ రామ్‌చరణ్ షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు ఇది మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. చిత్ర షూటింగ్ ముగిసింది. త్వరలో మీకు కొన్ని సాలిడ్ అండ్ క్రేజీ అప్‌డేట్ లను తీసుకువస్తున్నాము.. అంటూ పోస్ట్ చేసారు.
దానితో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు. డిసెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది.. ఇక దర్శకుడు శంకర్ ఈరోజు ఇండియన్ 2 మీడియా మీట్ లో గేమ్ చేంజర్ కబుర్లు ఏమైనా చెబుతారేమో అని తెలుగు మీడియా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.