సినీ నటి హేమ బెంగుళూరు రేవు పార్టీలో అడ్డంగా దొరికిపోయి కూడా ఎన్నెన్నో డ్రామాలాడింది. పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు సమాధానమివ్వని హేమ తర్వాత మూడో నోటీసు కి వివరణ ఇచ్చి అరెస్ట్ అయ్యి కొద్దిరోజులు జైలుకెళ్లింది. ఆ తర్వాత బెయిల్ పై బయటికొచ్చిన హేమ కి మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి షాకిచ్చాడు. ఇంత జరిగినా హేమ తన తప్పేమి లేదు అని బుకాయిస్తూనే అది. అదేదో మీడియానే హేమని ఇరికించినట్లుగా ఆమె మాట్లాడింది.
తాజాగా హేమ మా సభ్యత్వం రద్దుపై తనకి న్యాయం చెయ్యాలంటూ మంచు విష్ణుకి బహిరంగ లేఖ రాయడమే కాదు.. తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం బట్టి, ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అపాంట్మెంట్ తీసుకోని తనకు న్యాయం జరిగేలా కోరబోతున్నట్లుగా హేమ పేర్కొంది.
హేమ మా అధ్యక్షుడు మంచు విష్ణు కి రాసిన లేఖలోని హైలైట్స్..
మా కు నటి హేమ లేఖ..
బెంగుళూరు రేవు పార్టీ వ్యవహారం.. తదనంతరం తనపై వచ్చిన ఆరోపణలపై.. మా సభ్యత్వం తొలగింపుపై లేఖ రాసిన హేమ
లేఖను, తన టెస్ట్ రిపోర్ట్‌ను స్వయానా మంచు విష్ణుకు అందచేసిన హేమ..
రేవ్ పార్టీ ఉదంతంలో తనపై దుష్ప్రచారం జరిగిందని లేఖలో పెర్కొన్న హేమ..
మా వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన హేమ..
ఇటీవలె డ్రగ్స్ టెస్ట్ చెయించినట్లు.. తనకు నెగిటివ్ వచ్చినట్లు లేఖలో పెర్కొన్న హేమ ..
త్వరలోనే పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి
కానీ ఈలోపు ఒత్తిడితో నా మా సభ్యత్వం తొలగించారు
మా బైలాస్ ప్రకారం నాకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదు
నా వివరణను తీసుకోలేదు
నా సభ్యత్వాన్ని కొనసాగించాలి
నాకు మా సపోర్ట్ కావాలి.
హేమ లేఖ ను అడ్వెచరీ కమిటీ కి పంపిస్తామని .. మా కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన మంచు విష్ణు..