హాస్య బ్రహ్మ కొన్నాళ్లుగా సినిమాలు చెయ్యడం తగ్గించారు. కొన్ని కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో మెరుస్తున బ్రహ్మానందం ఆ మద్యన వచ్చిన కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లొ అతిధి పాత్రలకి పరిమితమైన బ్రహ్మ్మనందం ఈమధ్యన విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన కల్కి చిత్రంలో కనిపించారు.
తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మి లోకనాయకుడు కమల్ హాసన్ ని బిగ్ సర్ ప్రైజ్ చేసారు. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం కమల్ హాసన్ వాయిస్ ని మిమిక్రి చేసి అందరిని ఆశ్చర్య చకితులని చేసారు. కమల్ ఎలా మాట్లాడతారో అచ్చం బ్రహ్మి అలానే కమల్ వాయిస్ ని ఇమిటేట్ చెయ్యడం అందరికి తెగ నచ్చేసింది.
అంతేకాదు కమల్ స్టేజ్ పైకి వచ్చి నేను చెప్పాల్సిన మాటలన్నీ నా వాయిస్‌లో బ్రహ్మానందం చెప్పేశారు.. అంటూ సరదాగా చెప్పారు. ఇంకా బ్రహ్మి మట్లాడుతూ.. కమల్ హాసన్ సర్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ భారతీయుడు 2లో నటించడం ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల నుంచీ కమల్ హాసన్ గారిని చూస్తున్నాను. ఆయన శరీరంలోని ప్రతీ అణువణువు నటిస్తుంది. ఎంత కావాలో అంతే నటించగలిగే సత్తా ఉన్న నటులు. తాజ్ మహల్‌ను చూస్తే ఎంత అందంగా ఉందో అని అంటాం.. అలానే కమల్ హాసన్ గారు మన ముందుంటే.. ఆయన గొప్ప నటులు అని అనాల్సిందే. క
మల్ హాసన్ గారు తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు. ఆర్టిస్టుల నుంచి ఎంత నటన కావాలో రాబట్టుకునే దర్శకుడు శంకర్. కమల్ హాసన్ గారి సమకాలీకుడనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతుంటాను.. అంటూ బ్రహ్మి ఆ ఈవెంట్ లో మట్లాడారు.