Advertisement

వైసీపీ పేరు మారుతోందా..!?

Mon 08th Jul 2024 10:06 AM
ycp  వైసీపీ పేరు మారుతోందా..!?
Is the name of YCP changing..!? వైసీపీ పేరు మారుతోందా..!?
Advertisement

వైసీపీ పేరు మారుతోంది..! ఇప్పుడిదే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పెద్ద చర్చ. అవును మార్చాల్సిందేనని కొందరు.. అబ్బే అవసరం లేదని మరికొందరు.. ఉన్నది ఉండనివ్వకుండా లేనిలేని హడావుడి, మార్పులు.. చేర్పులు అవసరమా..? అని ఇంకొందరు సలహాలు, సూచనలు చేస్తున్న పరిస్థితి.! కొందరు వైసీపీ మేథావులు అయితే.. మార్చి తీరాల్సిందే అని చెబుతుంటే.. మహాప్రభో ఉన్నది ఉండనివ్వండని ఇలా ఎవరికి తోచింది వారు చెప్పేస్తున్నారు. ఇక చూస్కోండి.. ఇదే విషయంపై వార్తలు రాయాల్సి వస్తే.. రాసుకున్నోళ్లకు  రాసుకున్నంత.. మాట్లాడుకున్నోళ్లకు మాట్లాడుకున్నంత అంతే..!

ఇదీ అసలు సంగతి!

మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్‌ చానెల్స్‌ను జనాలు ఏ మాత్రం పట్టించుకుంటున్నారో తెలియదు కానీ.. సోషల్ మీడియాను మాత్రం గట్టిగానే చూసేస్తున్నారు. ఎంతలా అంటే.. అది నెగిటివా, పాజిటివా అనేది పక్కనెడితే జనాల మెదళ్లలో అలా ఉండిపోతోంది..! ఇదే వైసీపీ ఓటమికి గల కారణాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై నెట్టింట్లో ప్రచారం.. ఇక సూపర్ సిక్స్ విషయంలో సోషల్ మీడియాను వాడుకున్న తీరును చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. ఇప్పుడు ఎన్నికలైపోయాయి.. ఎవరి పనుల్లో వారున్నారు ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో వైసీపీపై సరికొత్త ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. పార్టీ పేరు మార్చడమే..!

వైసీపీలో మార్పు ఎలా..?

వైసీపీ అంటే.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. కానీ ఇప్పుడు పార్టీ పేరులో మార్చి, కొత్తగా చేర్పు చేయాలన్నదే ఇప్పుడు వస్తున్న డిమాండ్. అదెలాగంటే.. శ్రామిక స్థానంలో సంక్షేమ అని పెట్టాలన్నది ప్రధాన డిమాండ్. ఇలా మార్చినా వైసీపీ అన్నది అలాగే ఉంటుంది కానీ.. పూర్తి పేరు రాసేటప్పుడు మాత్రం మారిపోతుందన్న మాట. ఇది కొందరు వైసీపీ కార్యకర్తలు, నేతలు.. మేథావులు అని చెప్పుకుంటున్న వారి నుంచి వస్తున్న డిమాండ్ ఇదే. అది కూడా వైఎస్సార్ జయంతి సందర్భంగా సభావేదికగా ప్రకటించాలని కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలానే చేశారని.. రాబోయే రోజుల్లో చేయాల్సినవి ప్రతిబింబిస్తూ పార్టీ పేరును పరిశీలించాలని పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. 

అయ్యే పనేనా..?

కార్యకర్తలు, నేతల నుంచి విజ్ఞప్తులు అయితే పెద్ద ఎత్తునే వస్తున్నాయ్ మరి. జగన్ మనసులో ఏముందో ఏంటో అనేది తెలియట్లేదు. అయినా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం అయితే జగన్‌కు ఏ మాత్రం లేదు. అయినా.. ఉన్నది ఉండనివ్వక లేని పోనివి పెట్టుకుంటే అసలుకే ఎసరు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి నానా తిప్పలు పడుతున్నారన్నది తెలుసుకుంటే మంచిది మరి. వైసీపీ ఓటమిపాలయ్యాక.. పార్టీ, వైఎస్ జగన్‌పై ఎంతలా నెగిటివ్ వార్తలు వస్తున్నాయో.. వాటిని పార్టీ నేతలు ఎలా ఖండిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ వార్తలపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Is the name of YCP changing..!?:

How to change in YCP..?

Tags:   YCP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement