టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ఎవరైనా ఉన్నారు అంటే టక్కున ప్రభాస్ పేరే చెబుతారు. 40 ఏళ్ళు దాటిపోయాయి, ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. వరస సినిమాలు చేస్తున్నాడు. కానీ వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయ్యే ఆలోచన చెయ్యడం లేదు అని ఆయన కుటుంబ సభ్యులకే కాదు అభిమానులకి ఆరాటంగానే ఉంది.
కృష్ణంరాజు గారు ప్రభాస్ పెళ్లి కోరిక తీరకుండానే కన్ను మూసారు. ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా అని ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా.. ఫ్యాన్స్ తెగ వెయిట్ చేసున్నారు. ప్రభాస్ అనుష్క ని ఇష్టపడుతున్నాడని, ఆమెనే పెళ్లి చేసుకుంటాడని చాలా రకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆదిపురుష్ అప్పుడు కృతి సనన్ తో ప్రభాస్ లవ్ లో ఉన్నాడు అన్నారు. ప్రభాస్ మాత్రం అవన్నీ తూచ్ అంటాడు.
ఇక కృష్ణంరాజు గారు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు అప్పుడప్పుడు ప్రభాస్ పెళ్లిపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా కల్కి విషయాలు మాట్లాడుతూ ఆవిడ ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. ప్రభాస్ కి పెళ్లి చేయాలని మాకూ కోరికగానే ఉంటుంది. కానీ దానికి తగిన సమయం రావాలి. ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం.
అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవిగారు ఆయన పెళ్లిపై రియాక్ట్ అయ్యారు.