Advertisement

బీఆర్ఎస్‌కు ఇక యువరక్తం!

Sun 07th Jul 2024 08:22 PM
kcr  బీఆర్ఎస్‌కు ఇక యువరక్తం!
BRS.. Everything is changing! బీఆర్ఎస్‌కు ఇక యువరక్తం!
Advertisement

బీఆర్ఎస్‌.. మొత్తం మారుతోంది!

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యి, పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోవడంతో అసలు లోపం ఎక్కడుంది..? ఎందుకిలా జరిగిందనే దానిపై ఉమ్మడి జిల్లాల వారిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విశ్లేషణ చేపట్టారు. పార్టీ నాయకులు, కేడర్‌తోపాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని క్రోడీకరించిన గులాబీ బాస్.. కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారట. దశాబ్దకాలంగా పార్టీ, పాలనాపరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదికల ద్వారా అనేక సూచనలు అందినట్లు సమాచారం. ఫైనల్‌గా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నుంచి బీఆర్ఎస్‌లో యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

దిద్దుబాటు చర్యలు!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకొనే మార్పులు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారని ఓ సీనియర్ నేత చెబుతున్నారు. అందుకే.. సంస్థాగతంగా అధినేత కేసీఆర్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు, పార్టీ జిల్లా.. రాష్ట్ర కమిటీల్లో ప్రధాన పదవులు కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలతో తిరిగి దోస్తీకి కసరత్తు చేస్తున్నారు బాస్.

ఎక్కడ చూసినా ఇదే..!

తెలంగాణ ఉద్యమం మొదలుకుని నేటి వరకూ పార్టీ ఎంతో మంది సీనియర్లు, జూనియర్లు.. కులం, మతం తేడా లేకుండా చోటిచ్చింది.! అయితే అధికారం లేకపోయే సరికి ఒక్కొక్కరుగా కారు దిగేసి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో ఇక పార్టీలో అంతా యువరక్తమే ఉండాలని.. అది కూడా కొట్లాడే వాళ్లే ఉండాలని ఎటు చూసినా అంతా యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఉద్యోగ సంఘాలు మొదలుకుని సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇలా ఎవరు చూసినా ఉడుకు రక్తమే ఉండాట. ఇక ఫైనల్‌గా ఎన్నికల్లో పోటీ కూడా యువ రక్తాన్నే చేయించాలని బాస్ గట్టిగా అనుకుంటున్నారట. ఆగస్టులో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభావేదికగా ఇందుకు సంబంధించి కీలక ప్రకటనలే ఉంటాయని తెలుస్తోంది.

బాగానే తెలిసొచ్చిందే..!

రెండు దశాబ్దాలపాటు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది బీఆర్ఎస్సే.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే..!  అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మోనార్క్‌గా మారి ఉద్యమంలో పాల్గొన్న సాధారణ పౌరులు మొదలుకుని నేతల వరకూ పట్టించుకోకపోవడం.. అంతేకాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు అని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఏమీ సాధించలేకపోవడం.. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగిపోవడం ఇవన్నీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయానికి కారణాలే. అందుకే.. ఇప్పుడిప్పుడే అవన్నీ తెలుసుకున్న కేసీఆర్ పోయినచోటే వెతుక్కోవాలనే నానుడిగా మొత్తం మార్చేయాలని ఫిక్స్ అయ్యారట. మార్పు మంచిదే.. ఎనీ వే ఆల్ ది బెస్ట్ బాస్..!

 

BRS.. Everything is changing!:

Is KCR changing everything..!

Tags:   KCR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement