సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు లండన్ లో ఫ్యామిలీ తో కలిసి తెగ ఎంజాయ్ చేసాడు. భార్య నమ్రత, కుమార్తె సితార, కొడుకు గౌతమ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తో కలిస్ లండన్ ని చుట్టేసిన మహేష్ ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో పెరిగిన గెడ్డంతో ఎప్పటిలాగే తన లుక్ ని క్యాప్ తో కవర్ చేసేసాడు.
ఇక గౌతమ్ స్టైలిష్ గా కనిపించగా నమ్రత, సితారలు క్యాజువల్ గా కనిపించారు. మహేష్ బాబు మాత్రం తన నెక్స్ట్ చిత్రం కోసం మారుస్తున్న స్టయిల్స్ ఇలా ఎయిర్ పోర్ట్ లోనో లేదంటే ఫ్యామిలీ పిక్స్ లో కాస్త కాస్త రివీల్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ విజువల్స్ ని మహెష్ ఫ్యాన్స్ ఉత్సాహంగా తెగ స్ప్రెడ్ చేస్తున్నారు.
రాజమౌళి తో మహేష్ మూవీ ఆగస్టు లో అనౌన్సమెంట్ వచ్చి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా పనుల్లోనే తలమునకలై ఉన్నారు.