కొన్నాళ్లుగా సౌత్ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే కి ఇప్పుడు సౌత్ లో అందులోను తమిళ్ క్రేజీ పాన్ ఇండియా ఆఫర్ తగిలింది. అది స్టార్ హీరో సూర్య తో పూజ హెగ్డే రొమాన్స్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయిన పూజ హెగ్డే హిందీలో పలు ప్రాజెక్ట్స్ లో చేస్తుంది.
కొద్దిరోజులుగా అవకాశాలు లేకపోతేనేమి.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామర్ ఫోటో షూట్స్ అలాగే ట్రెడిషనల్ ఫోటో షూట్స్ తో పూజ హెగ్డే ఎప్పటికప్పుడు యూత్ ని తనవైపు తిప్పుకుంటుంది. గ్లామర్ లుక్స్, మెస్మరైజ్ బ్యూటీ అంటూ పూజ హెగ్డే ని ఆమె అభిమానులు అభివర్ణిస్తూ ఉంటారు.
తాజాగా పూజ హెగ్డే బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో చక్కటి చీర కట్టులో, మెడ నిండా ఆభరణాలతో, చేతులకి బంగారు గాజులతో చెవులకి జుంకాలతో పూజ హెగ్డే న్యూ లుక్ చూస్తే నిజంగా పుత్తడిబొమ్మలా ఉంది ఈ బుట్టబొమ్మ అంటూ కామెంట్ చెయ్యడం ఖాయం. పోత పోసిన అందంతో పూజ హెగ్డే కొత్త ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి.