ప్రతి ఏడాది వినాయక చవితి రోజున టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర పోటీ వాతావరణం కనిపిస్తుంది. యంగ్ హీరోలు చాలామంది వినాయక చవితి ఫెస్టివల్ ని చూజ్ చేసుకుంటారు. సంక్రాంతి, దసరా, క్రిష్టమస్, వేసవి తర్వాత అంత ప్రాధ్యానత వినాయక చవితి వీక్ కే ఉంటుంది. ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా కొంతమంది హీరోలు వినాయకుడి మీద భారం వేస్తున్నారు.
అందులో కోలీవుడ్ హీరో విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్ మూవీని సెప్టెంబర్ 5న వినాయక చవితికి విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ టైం ఫిక్షన్ డ్రామా పాన్ ఇండియా ఫిలిం గా విడుదల కాబోతుంది. అదే వారం అంటే సెప్టెంబర్ 6 న నారా రోహిత్ సుందరకాండ కి టైమ్ ఫిక్స్ చేసారు.
ఇక ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 7 న దుల్కర్ సల్మాన్ - మీనాక్షి చౌదరిల లక్కీ భాస్కర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ సుముఖంగా ఉన్నారు. లక్కీ భాస్కర్ అసలైతే OG డేట్ సెప్టెంబర్ 27 న చూజ్ చేసుకుంటే ఇప్పుడా డేట్ ని ఎన్టీఆర్ దేవర కోసం లాగేసాడు. అందుకే లక్కీ భస్కర్ వినాయక చవితి బరి లో చేరింది.
గత నాలుగైదు నెలలుగా నీరసంగా కనిపించిన బాక్సాఫీసు కల్కి 2898 AD చిత్రం విడుదల తో ఒక్కసారిగా ఊపొచ్చింది. ఆ తర్వాత ఇండియన్ 2, అలాగే ఆగష్టు లో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, సరిపోదా శనివారం లాంటి సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితికి ముగ్గురు హీరోలు త్రిముఖ పోటీకి సిద్దమయ్యారన్నమాట.